ఇదేందయ్యా ఇది.. అభివృద్ధి చెందాలంటే దత్తత తీసుకోవాలా: వైఎస్ షర్మిల

-

రాష్ట్ర మంత్రి కేటీఆర్​పై వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఘాటుగా విమర్శలు గుప్పించారు. మునుగోడులో టీఆర్ఎస్ ను గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానన్న కేటీఆర్ వ్యాఖ్యలపై షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మాట్లాడేటప్పుడు చిన్న దొర కాస్త ఆలోచించాలని షర్మిల హితవు పలికారు.

టీఆర్ఎస్ అధికారంలో ఉన్నా రాష్ట్రంలో నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే దత్తత తీసుకోవాలా అంటూ వైఎస్ షర్మిల విమర్శించారు. మునుగోడు ప్రాంతం పక్క రాష్ట్రంలో లేదా పక్క దేశంలో ఉందా అంటూ ఎద్దేవా చేశారు. మునుగోడులో తన మద్దతు కావాలని కొందరు అడిగారని.. తాను ఎవరికీ మద్దతు ఇవ్వనని తెలిపినట్లు వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.

రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద స్కామ్ జరిగిందని వైఎస్ షర్మిల ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్​ రెడ్డి ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టును ప్రాణహిత చేవెళ్ల పేరుతో పూర్తి చేయాలని అనుకున్నారని గుర్తు చేశారు. కానీ కేసీఆర్ దానిని మూడింతలు పెంచారని విమర్శించారు. గతంలో జరిగిన ఇతర స్కామ్​లతో పోలిస్తే కాళేశ్వరం ఇంకా పెద్ద స్కామ్​ అని దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news