మునుగోడు ప్రజలకు గుడ్ న్యూస్.. రెవెన్యూ డివిజన్ గా చండూరు !

-

మునుగోడు ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు మంత్రి కేటీఆర్. త్వరలోనే రెవెన్యూ డివిజన్ గా చండూరును మర్చుతామని ప్రకటన చేశారు. గట్టుప్పల్ లో నిర్వహించిన గౌడ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి పేదవాడికి తమ ప్రభుత్వం న్యాయం చేస్తోందని అన్నారు.

తెలంగాణలో కరెంటు సమస్య తీరిపోయిందని తెలిపారు. ఒకప్పుడు నల్గొండ జిల్లాలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదని, నల్గొండ జిల్లాలో అమ్మాయిని ఇవ్వాలంటే తల్లిదండ్రులు ఆలోచించేవారని పేర్కొన్నారు. ఇప్పుడు ఇంటి ముందే నల్లా ఏర్పాటు చేసి నీరు అందిస్తున్నామని కేటీఆర్ చెప్పారు. రైతు ధీమాగా వ్యవసాయం చేసుకోగలుగుతున్నాడని వివరించారు.కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన రాజగోపాల్ రెడ్డి బిజెపికి కోవర్టుగా ఉండి తన ఎమ్మెల్యే స్థానాన్ని 1800 కోట్లకు తాకట్టు పెట్టిన ఘనుడు రాజగోపాల్ రెడ్డి అని ఆగ్రహించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన తమ్ముడి కోసం నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలకు ఫోన్లు చేస్తున్నాడు ఇది కోవర్ట్ రాజకీయం కాదా..? అని నిలదీశారు. చిన్న కంపెనీకి పెద్ద కాంట్రాక్ట్ ఇచ్చిన పెద్ద మనుషులు ఎవరో అందరికీ తెలుసు అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news