కింగ్‌ కోహ్లీపై బీసీసీఐ అధ్యక్షుడు ప్రశంసలు

-

బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ కింగ్‌ కోహ్లీపై ప్రశంసలు కురిపించారు. టీ20 ప్రపంచకప్ లో పాకిస్థాన్ పై కోహ్లీ ఆడిన ఇన్నింగ్స్ ఒక స్వప్నం లాంటిదని, ప్రేక్షకులకు ఒక ట్రీట్ వంటిదని అన్నారు రోజర్ బిన్నీ. కోహ్లీ ఒక అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడారని రోజర్ బిన్నీ కితాబిచ్చారు. కోహ్లీ ఇన్నింగ్స్ తనకు ఒక డ్రీమ్ లా ఉందని… గ్రౌండ్ లో నలుమూలలకు కోహ్లీ బంతిని తరలించాడని రోజర్ బిన్నీ చెప్పారు. కోహ్లీ వంటి ఆటగాళ్లు ఒత్తిడిలో మరింత మెరుగైన ఆటను ఆడతారని వ్యాఖ్యానించారు రోజర్ బిన్నీ. పాక్ పై సాధించింది ఒక గొప్ప విజయమని అన్నారు. మ్యాచ్ లో పాకిస్థాన్ గెలుస్తుందేమో అనే భావనకు అందరూ వచ్చిన సమయంలో… ఒక్క సారిగా భారత్ చేతుల్లోకి వచ్చిందని రోజర్ బిన్నీ చెప్పారు. ఈ మ్యాచ్ ప్రేక్షకులకు అంతులేని వినోదాన్ని అందించిందని అన్నారు.

We can't say...': BCCI president Roger Binny reacts to PCB's call to  boycott ODI World Cup 2023 in India | Cricket News | Zee News

మ్యాచ్ లో ఇండియా గెలిచిన తీరును అందరూ అభినందిస్తున్నారని చెప్పారు రోజర్ బిన్నీ. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కు తాను ఎంతో రుణపడి ఉన్నానని రోజర్ బిన్నీ అన్నారు. దాదాపు 50 ఏళ్ల పాటు తాను కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కు సేవ చేశానని చెప్పారు. 1973లో అండర్ 19 ఆడినప్పటి నుంచి ఇప్పుడు బీసీసీఐ అధ్యక్షుడు అయ్యేంత వరకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తో తనకు అనుబంధం ఉందని అన్నారు రోజర్ బిన్నీ.

Read more RELATED
Recommended to you

Latest news