మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఆ నియోజకవర్గానికి రాష్ట్రంలోని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇలా టిఆర్ఎస్ నేతలంతా చేరి అక్కడ ప్రచారం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కో ఎంపిటిసి పరిధిలో లేదా మునిసిపాలిటీలో రెండు వార్డులకు ఒక నేతను యూనిట్ ఇన్చార్జిగా నియమించారు. అయితే ఇలా నియోజకవర్గ వ్యాప్తంగా గులాబీ దండు మోహరించడం పై బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
” నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే.. 86 మంది బానిస ఎమ్మెల్యేలు, 15 మంది దద్దమ్మ మంత్రులు, 12 మంది అసమర్ధ ఎమ్మెల్సీలు & ఎంపీలు, ఒక దగాకోరు ముఖ్యమంత్రి వచ్చారు.. అవసరమా ? నిజంగా అభివృద్ధి చేసి ఉంటే ఇంతమంది మునుగోడుకు రావలసిన అవసరంం ఏముంది?” అని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే….
86 మంది "బానిస " ఎమ్మెల్యేలు
15 మంది "దద్దమ్మ" మంత్రులు
12 మంది "అసమర్థ " ఎమ్మెల్సీలు & ఎంపీలు,ఒక "దగాకోరు" ముఖ్యమంత్రి వచ్చారు… అవసరమా ?
నిజంగా అభివృద్ధి చేసి ఉంటే ఇంతమంది మునుగోడు రావాల్సిన అవసరం ఏముంది ? #MunugodeWithBJP
— Komatireddy Raj Gopal Reddy (@krg_reddy) October 30, 2022