ఉక్రెయిన్ స్ట్రాంగ్ రివేంజ్.. ఒక్కరోజే 1000 మంది రష్యా సైనికులు మృతి

-

ఉక్రెయిన్ పై బాంబులతో విరుచుకుపడుతున్న రష్యాపై ఆ దేశం గట్టిగా తిరగబడుతోంది. రష్యా దళాలలపై ప్రతిదాడికి దిగుతూ వారిని తమ భూభాగాల్లోకి తరమికొడుతోంది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ సరైన ఆయుధాలు లేని మాస్కో సైనికులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ ఘటనలో రష్యా భారీ మొత్తంలో సైన్యాన్ని నష్టపోయిందని ఉక్రెయిన్‌ రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. కీవ్‌ దాడుల్లో ఒక్క రోజే కనీసం 1000 మంది మాస్కో సేనలు మృతి చెందినట్లు పేర్కొన్నాయి.

ఉక్రెయిన్‌పై దాడి కోసం రష్యా ఇటీవల వేలాది మంది సైనికులను ముందు వరుసలో కొత్తగా మోహరించింది. వీరిలో చాలా మంది రిజర్విస్టులే. అయితే వీరి వద్ద సరిపడా ఆయుధాలు లేవని కొద్ది రోజుల క్రితం బ్రిటిష్‌ రక్షణ నిఘా వర్గాల నిపుణులు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్‌ సేనలు వారిపై దాడులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో ఒక్కరోజులోనే కనీసం 1000 మంది క్రెమ్లిన్‌ సైనికులు మృతి చెందినట్లు ఉక్రెయిన్‌ రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.

ఈ ప్రత్యేక ‘సైనిక చర్య’లో ఇప్పటివరకు రష్యా 71వేల మందికి పైగా సైనికులను నష్టపోయినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే తాజా మరణాలపై రష్యా నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news