ఈ నెల 7న ఆస్ట్రేలియ పర్యటనకు రాజగోపాల్ రెడ్డి?

-

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. నియోజకవర్గ వ్యాప్తంగా 7 మండలాల్లో 2,41,855 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే… ఈ మునుగోడు కౌంటింగ్ 6వ తేదీతో ముగియనుండటంతో 7వ తేదీన రాజగోపాల్ రెడ్డి ఆస్ట్రేలియా టూర్ కు వెళుతున్నట్లు చెబుతున్నారు.

గత నాలుగు రోజులుగా జోరుగా ప్రచారం చేయడంతో, విశ్రాంతి కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లబోతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 1వ తేదీ న ప్రచారం ముగియగానే రాజగోపాల్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళినట్లు కొన్ని ఫోటోలు నెట్టింట ఇంత చక్కర్లు కొట్టాయి.

ఇప్పటికే ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న తన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో రాజగోపాల్ రెడ్డి దిగిన పాత ఫోటోలను ఇప్పుడు కొంతమంది వైరల్ చేస్తున్నారు. గతంలో దిగిన ఫోటోలను పోస్ట్ చేస్తూ రాజగోపాల్ రెడ్డి కూడా ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు ప్రచారం చేస్తున్నారు. ఈ ఫోటోలపై కోమటిరెడ్డి బ్రదర్స్ వర్గీయులు సీరియస్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news