అయ్యన్న అరెస్ట్‌పై హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌

-

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి అరెస్ట్‌పై హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలైంది. అయ్యన్న తరఫు న్యాయవాదులు ఈ పిటిషన్‌ వేశారు. తనను నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్‌ చేశారని అయ్యన్న పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై కాసేపట్లో విచారణ జరిగే అవకాశముంది.

మరోవైపు డీజీపీ కార్యాలయం వద్ద భద్రత పెంచారు. అయ్యన్నపాత్రుడి అరెస్ట్‌ నేపథ్యంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి డీజీపీ ఆఫీస్‌కు వెళ్లే మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు వస్తారనే అనుమానంతో డీజీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు.

ఇప్పటికే అయ్యన్న అరెస్టుపై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయ్యన్న ఫ్యామిలీని టార్గెట్ చేసిందని ఆరోపించారు. ఆయన కుటుంబాన్ని కొంతకాలం నుంచి వేధింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. దౌర్జన్యంగా అర్ధరాత్రి సమయంలో ఇంటి గోడ దూకి అరెస్టు చేశారని దుయ్యబట్టారు. ఆయ్యన్నపై ఇప్పటికే 10కిపైగా కేసులు పెట్టారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news