Breaking : గుజరాత్‌ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల

-

కేంద్ర ఎన్నికల సంఘం గుజరాత్‌ ఎన్నికల షెడ్యూ్‌ల్‌ను విడుదల చేసింది. అయితే ఇప్పటికే.. దేశంలో పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల హీట్ మొదలైంది. తాజాగా బుధవారం గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వివరాలను ఆయన అందించారు. రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించవచ్చని వార్తలు వస్తున్నాయి. దేశం మొత్తం గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారిస్తోంది. గత 25 ఏళ్లుగా బీజేపీ గుజరాత్‌ను పాలిస్తోంది. గుజరాత్‌లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈసీ ఎన్నికల తేదీని ప్రకటించకముందే ఆప్ తన అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. బీజేపీ, కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థులను ఖరారు చేసే పనిలోనే ఉన్నాయి.

Election Commission of India | Zee News Telugu

గుజరాత్ అసెంబ్లీలోని మొత్తం 182 స్థానాలున్నాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీ గడువు ఫిబ్రవరిలో ముగియనుంది. మామూలుగా గుజరాత్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉండేది. కానీ ఈసారి ఆప్ ఎంట్రీతో సీన్ మారే అవకాశముందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే అభ్యర్థుల లిస్టు విడుదల చేయడంతో గుజరాత్లో ఈ సారి బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ మధ్య ముక్కోణపు పోటీ ఖాయమని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news