బాలీవుడ్ స్టార్​ సల్మాన్​ ఖాన్​తో హరీశ్ శంకర్ సినిమా..!

-

డైరెక్టర్ హరీశ్ శంకర్ అనగానే మనకు గుర్తొచ్చేది కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్​టైనర్ సినిమాలు. ఓ పక్క ఫ్యామిలీ డ్రామా పండిస్తూనే మరోవైపు మాస్ ప్రేక్షకులను ఆకర్షించేలా కమర్షియల్ హంగులద్దుతుంటాడు. ఈయన సినిమా అంటే ప్రేక్షకులు మినిమమ్ ఎంటర్​టైన్మెంట్ ఉంటుందని ఫిక్స్ అయి మరీ థియేటర్లకు వెళ్తుంటారు. కానీ హరీశ్ స్పీడ్ తగ్గించాడు. ‘గద్దలకొండ’తర్వాత ఆయణ్నుంచి మరో సినిమా రాలేదు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్​తో ‘భవదీయుడు భగత్ సింగ్’ మూవీ చేస్తున్నట్లు వార్తలు వచ్చినా.. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ఆ మూవీకి కాస్త సమయం పట్టేలా ఉంది.

అయితే ఈ సమయంలో హరీశ్ శంకర్ బాలీవుడ్​పై కాన్సంట్రేట్ చేశాడు. బాలీవుడ్ స్టార్ సల్మాన్​ ఖాన్​తో తన నెక్స్ట్ మూవీ తీయాలని హరీశ్ శంకర్ గట్టిగా ట్రై చేస్తున్నాడట. దాని కోసం ముంబయి కూాడా వెళ్లాడట. త్వరలోనే సల్మాన్​ను కలిసి స్టోరీ నరేట్ చేయనున్నట్లు టాక్. సల్మాన్​ ఓకే అంటే ఈ ప్రాజెక్ట్​ను మైత్రీ మేకర్స్ నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం హరీశ్​ ‘ఏటీఎమ్‌’ అనే వెబ్‌సిరీస్‌కు నిర్మాతగా పనిచేస్తున్నాడు. సస్పెన్స్‌ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ వెబ్‌ సిరీస్‌కు దిల్‌రాజు కూతురు హర్షితా రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news