తిరుమల ఎఫెక్ట్..సింహాచలం ఆలయంలో 945 కిలోల నెయ్యి సీజ్!

-

తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ కల్తీ వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. లడ్డూ తయారీలో జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యిని వినియోగించారని ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు టీటీడీ ఈవో శ్యామలరావు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆరోపణలు,ప్రత్యారోపణలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి.కల్తీ నెయ్యికి గల కారణమైన వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని,సీబీఐతో విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏపీలోని ప్రసిద్ధిచెందిన పుణ్య‌క్షేత్రాల్లో ఒకటైన విశాఖపట్నం జిల్లాలోని సింహాచలం అప్పన్నస్వామి ఆలయంలో అధికారులు తనిఖీలు జరిపారు.945 కిలోల నెయ్యిని సీజ్‌ చేశారు. ఏలూరు జిల్లా రైతు డెయిరీ దీనిని సరఫరా చేసినట్లు అధికారులు గుర్తించారు.నెయ్యి శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపించామని, అలాగే లడ్డూ ప్రసాదంలో వాడే ఇతర పదార్థాలను కూడా పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించినట్టు అధికారులు తెలిపారు.భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు తనిఖీలు నిర్వహించి నెయ్యిని సీజ్ చేశామని, పూర్తి నివేదిక వచ్చిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి అప్పారావు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news