12న తెలంగాణకు మోడీ.. మరోసారి కేసీఆర్ డుమ్మా !

-

తెలంగాణకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. నవంబర్ 12వ తేదీన తెలంగాణకు రానున్న మోదీ పెద్దపల్లి జిల్లా రామగుండంలోని రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ను జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. గతంలో మూతపడిన రామగుండం ఎఫ్ సి ఐ పునరుద్ధరణకు కేంద్రం చర్యలు తీసుకుంది. రూ.6,120 కోట్లతో కేంద్ర ప్రభుత్వం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునర్నిర్మాణం చేసింది.

అయితే, ఎప్పటినుంచో ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ మధ్య గ్యాప్ కొనసాగుతోంది. బీజేపీతో టిఆర్ఎస్ కు రాజకీయంగా వైరం కొనసాగుతోంది. నేరుగా మోడీ టార్గెట్ గా మీడియా సమావేశాల్లో కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఒక్కో రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఒక్కో వేషంలో కనిపిస్తారంటూ మోదీపై సెటైర్లు పేల్చారు. అంతేకాకుండా ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంపై టిఆర్ఎస్, బిజెపి మధ్య విమర్శల యుద్ధం కొనసాగుతోంది. తెలంగాణకు నిధుల విషయంలో మోడీ సహాయం చేయలేదని, కనీసం అప్పు తీసుకోవడానికి కూడా అడ్డంకులు సృష్టిస్తున్నారని పలుమార్లు కేసీఆర్ ఆరోపించారు. ఈ తరుణంలో గతంలో డుమ్మా కొట్టినట్లుగానే, ఈసారి కూడా మోడీ పర్యటనకు కేసీఆర్ డుమ్మా కొడతారని ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news