సీఎం జగన్ ఒక అంబేడ్కర్, జగజ్జీవన్ రామ్ లాంటోడని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం అపహాస్యం అయిన తరుణంలో మన నాయకుడు పాదయాత్ర చేపట్టారని వెల్లడించారు మంత్రి మేరుగ నాగార్జున. సాహసోపేత నిర్ణయాన్ని ఆయన ప్రజల కోసం తీసుకున్నారని.. ఆ పాదయాత్ర నేడు రాష్ట్రంలో సంక్షేమ రాజ్యానికి నాంది పలికిందని వెల్లడించారు.
భావి తరాలకు బంగారు బాట వేయడానికి ఈ పాదయాత్ర అవకాశం కల్పించిందని.. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాధికారం ఇచ్చిన నేత వైఎస్ జగన్ అని తెలిపారు. రాష్ట్రానికి వైఎస్ జగన్ ఒక అంబేడ్కర్, జగజ్జీవన్ రామ్ నిలుస్తున్నారు.. ఐదేళ్ల క్రితం ఒక గొప్ప యజ్ఞం ప్రారంభం అయితే దాని ఫలాలు నేడు ప్రజలకు అందుతున్నాయన్నారు. పాదయాత్ర పేటెంట్ ఒక్క వైఎస్ కుటుంబానికే దక్కుతుందని వెల్లడించారు మంత్రి మేరుగ నాగార్జున.