ఏపీలో అభివృద్ధి చూస్తే గోవిందా – కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు

-

ప్రతి శుక్రవారం సంతకం పెట్టడానికే మూడున్నర సంవత్సరాల పాలన ఉపయోగపడిందని సీఎం జగన్ ని ఉద్దేశించి ఎద్దేవా చేశారు కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు. అయ్యన్నను పరామర్శించిన అనంతరం నర్సీపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి చూస్తే గోవిందా.. అని ఎద్దేవా చేశారు. ప్రజల్ని డైవర్ట్ చేయడానికే మూడు రాజధానుల డ్రామా ఆడుతున్నారని అన్నారు. ఎన్నికల ముందు కేంద్రాన్ని మెడలు వంచుతామని చెప్పి, చివరికి తానే పీ. ఎం కాళ్ళ ముందు మెడ దించాడని విమర్శించారు.

పాలనలో ప్రతిపక్షానికి భాద్యత ఉందన్నారు అశోక్ గజపతిరాజు. ఇప్పటికే మూడు తరాలు నాశనం చేశారని.. పాలనంతా రివర్స్ గేర్ లో వెళుతోందని మండిపడ్డారు. హై వేలు లేకపోతే రాష్ట్రంలో ఎవరూ రోడ్లమీద తిరిగే పరిస్థితి లేదన్నారు. సుజల స్రవంతి ఊసే లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబీకుల కేసులు ఇతర రాష్ట్రాలకు సుప్రీం కోర్టు కేటాయించిందని.. దీనిని బట్టి చూస్తే సి.ఎం పని తీరును అర్ధం చేసుకోవచ్చన్నారు. ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధులు ఊసే లేదని.. ప్రజల కోసం తెలుగుదేశం ఎప్పుడు పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

ఆదాయం వచ్చే దేవాలయాలను కాజేయడానికి ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. సింహాచలంలో భూములు కాజేయడానికి దొంగను చైర్మన్ చేశారని మండిపడ్డారు. ఆ ఆలయానికి 44 కిలోల బంగారం, 50 కోట్ల రాబడి వస్తుందని.. జనాలు, దేవుడిపై పడటం.. ఇలాంటి వాటిని ఖండిస్తున్నామన్నారు. దీనిపై తగిన విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. జగన్ రెడ్డి ఎన్నిసార్లు కేసులు నమోదు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనుకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news