టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర సిద్ధమవుతున్నారు. యాత్రపై పార్టీ నేతలకు లోకేష్ స్పష్టత ఇచ్చారు. 2023 జనవరి 27న పాదయాత్ర ప్రారంభించనున్నట్లు లోకేష్ తెలిపారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు నారా లోకేష్ పాదయాత్ర సాగనుంది. ఏడాది పాటు ప్రజల మధ్యలోనే ఉండేలా లోకేష్ పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్ధమైంది.
అయితే ఇప్పటికే రెండుసార్లు పాదయాత్ర తేదీలు వాయిదా పడ్డ నేపథ్యంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఈ పాదయాత్రను ప్రారంభించనున్నారు. పాదయాత్రకు మధ్యలో ఎక్కడ విరామం ఉండదని లోకేష్ చెప్పినట్టు సమాచారం. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ, ముఖ్యంగా యువతను ఆకట్టుకునే దిశగా లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. ఈ పాదయాత్రలకు సంబంధించిన విధివిధానాలని అన్నిటిని ఈ నెలాఖరు నుంచి ఫైనల్ చేసే అవకాశం ఉంది.