రాజీవ్ గాంధీ హత్య కేసు పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

-

రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో 30 సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్న ఆరుగురు దోషులను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. జైలులో వారి ప్రవర్తన కూడా బాగానే ఉండడంతో వారిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నలినితోపాటు రాబర్ట్, రవిచంద్రన్, రాజా, శ్రీహరన్, జై కుమార్ ను విడుదల చేయాలని ఆదేశించింది న్యాయస్థానం.

జస్టిస్ బిఆర్ గవాయి, బి.వి నాగరత్న నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పుని వెలువరించింది. కాదా మే 17న ఈ కేసులో మరో దోషిగా ఉన్న పెరారివాళన్ ని విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్షకు సిఫార్సు చేసినందున వారిని వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news