సినిమా పరిశ్రమలో సహజీవనం చేయడం, అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కామన్ గా మారింది . ఇప్పుడు సీరియల్స్ రాకతో అది పెద్ద పరిశ్రమగా మారింది. దీనితో ఇక్కడ నటించే వారు కుప్పలు తెప్పలుగా పెరిగారు. దీనితో రెండు పెళ్లిళ్లు చేసుకోవడం తర్వాత ఎవరికి తెలియకండా వేరే చోట కాపురాలు పెట్టేస్తున్నారు. ఈ సోషల్ మీడియా కాలంలో ఇది కచ్చితంగా ఎక్కడో చోట బయట పడే అవకాశం ఉంది.
ఇప్పుడు మాటీవి సీరియల్స్ నటించే ఒక నటుడు కు అతని భార్యకు ఇదే విషయంపై గొడవలు వస్తున్నాయట. ఇప్పుడు భార్య డెలివరీ కి వెళ్ళిన సమయంలో తన కో స్టార్ తో రిలేషన్ షిప్ మొదలు పెట్టాడట. ఇద్దరూ కలిసి సదరు సీరియల్ నటి ప్లాట్ లోనే రొమాన్స్ లో మునిగి తేలారట. ఈ విషయం లో పక్క ప్లాట్ వాళ్లు కూడా హెచ్చరించి వదిలేశారట.
దీనితో వారికి షూటింగ్ గ్యాప్ వస్తే ఇద్దరూ దూరంగా రిసార్ట్స్ లో అన్ని రకాలగా ఎంజాయ్ చేసి వచ్చే వారట. ఇలా చాలా రోజులు గడిచాయి.చివరికి ఆమె పుట్టింటి నుండి వచ్చి తన ఫోన్ చెక్ చేసే సరికి బండారం బట్టబయలు అయ్యింది. ఇక తాను జరిగింది వాళ్ల కుటుంబాలు కు చెప్పటానికి చూడగా, తాను ఆమె కాళ్ల మీద పడి క్షమంచమని వేడుకొని తన దగ్గరకి వెళ్లకుండా బుద్దిగా వుంటున్నాడట.