కోతి వేషాలతో కేఏ పాల్..పాదయాత్రతో షర్మిల..మాకు ఈ కర్మ ఏంటి – గంగుల

-

కరీంనగర్ పట్టణ 16వ డివిజన్ లో 44 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి గంగుల కమలాకర్. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ఢిల్లీ పాలకులు ఎంత విషం చిమ్మిన తెలంగాణ అభివృద్ధి ఆగదని.. ఆంధ్ర పార్టీలు తెలంగాణకు అవసరమా అని నిలదీశారు.


పాదయాత్రలతో కొందరు.. కోతి వేషాలతో కేఏ పాల్ లాంటి వారు తెలంగాణకు వస్తున్నారని చురకలు అంటించారు. సమైక్య పాలన ఇదివరకే చూశాం.. మళ్ళీ మీ పాలన అవసరంలేదని… దేశానికి ప్రధానిగా ఉన్న మోడీ ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడటం సరికాదని మండిపడ్డారు.

సీఎం కేసీఆర్ కు ప్రధాని కార్యాలయం ఆహ్వానం పంపకపోవడం ఇదేనా బిజెపి సంస్కృతి అని.. జీఎస్టి మేము కడితే ఫలాలు మాత్రం గుజరాత్ కా అని నిలదీశారు. ప్రధాని రామగుండంలో కొత్తగా ఏమైనా కర్మాగారాలు ప్రకటిస్తారని అనుకుంటే కేవలం రాజకీయాలే మాట్లాడారని.. ఢిల్లీ పాలకులకు తెలంగాణపై వివక్ష ఎందుకు అని ప్రశ్నించారు. దక్షిణ భారత దేశంలో బీజేపీకి తిరిగి చుక్కెదురు కాక తప్పదని.. దేశానికి ప్రధానిగా ఉన్న వ్యక్తి అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి..సంపద అందరికీ పంచాలన్నారు మంత్రి గంగుల కమలాకర్.

Read more RELATED
Recommended to you

Latest news