కృష్ణ నటించిన ఓ చిత్రం 123 దేశాల్లో విడుదలై బాహుబలి రేంజ్ సక్సెస్ అందుకుందని తెలుసా..

-

సూపర్ స్టార్ కృష్ణ.. యాక్షన్ చిత్రాలతో పాటు కుటుంబం నేపథ్యం ఉన్న చిత్రాల్లో కూడా నటిస్తూ అన్ని తరహా ప్రేక్షకుల్ని అలరించారు. అయితే అప్పట్లోనే ఆయన నటించిన ఓ చిత్రం అంతర్జాతీయంగా 123 దేశాల్లో విడుదలై బాహుబలి రేంజ్ సక్సెస్ ను అందుకుందని చాలామందికి తెలియదు..

 

కృష్ణ సూపర్ స్టార్ రేంజ్ ను అందుకొని వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్న సమయంలో ఆయనకి ఓ ఆలోచన వచ్చింది. తన తమ్ముళ్లు హనుమంతరావు, ఆదిశేషగిరిరావులతో కలిసి 1970 లో సొంత నిర్మాణ సంస్థ పద్మాలయ పిక్చర్స్ ను స్టార్ట్ చేశారు.. ఈ సంస్థ నుంచి మొదటగా అగ్నిపరీక్ష చిత్రం విడుదలైంది.. కృష్ణ, విజయనిర్మల, గుమ్మడి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి కె. వరప్రసాదరావు దర్శకత్వం వహించారు. అయితే ఈ చిత్రం అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.. ఈ సినిమా పరాజయం తర్వాత కృష్ణ ఎలా అయినా మరో మంచి సినిమా తీయాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే అప్పట్లో ఇంగ్లీషు సినిమా మెకన్నాస్ గోల్డ్ మద్రాస్ లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది..

ఈ చిత్రంతో పాటూ ఫ్యూ డాలర్స్ మోర్, గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ లాంటి ఇంగ్లీషు చిత్రాలకు ఆ రోజుల్లో లభించిన ఆదరణ చూసిన కృష్ణ.. ఈ మూడు చిత్రాల కథలను కలిపి కౌబాయ్ లాంటి ఓ సినిమాను తీయాలని అనుకున్నారు.. అయితే ఈ సినిమా బాధ్యతలు అన్నీ అప్పటి స్టార్ డైరెక్టర్ ఆరుద్రకు అప్పగించారు కృష్ణ. ఈ చిత్రానికి మాటలు, పాటలు, కథ రెడీ చేసి కృష్ణకు అందించారు ఆరుద్ర. అయితే ఇదంతా ఎంతగానో ఆయనకు నచ్చడంతో ఈ సినిమాకు దర్శకత్వం బాధ్యతలు ఆరుద్రనే తీసుకోవాలని కోరారు.. అయితే ఈ విషయానికి ఆయన ఒప్పుకోకపోవడంతో కేఎస్ఆర్ దాస్‌ దర్శకత్వం వహించారు.. తొలి తెలుగు కౌబోయ్ చిత్రంగా ట్రెండ్ సెట్ చేసిన ఆ చిత్రమే మోసగాళ్లకు మోసగాడు.

కృష్ణ, విజయనిర్మల, జ్యోతిలక్ష్మి, గుమ్మడి కైకాల సత్యనారాయణ, నాగభూషణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఆగస్టు 27, 1971న విడుదలై ఘన విజయాన్ని అందుకుంది.. జాతీయంగా ఎన్నో భాషల్లో విడుదలైన ఈ చిత్రం దేశ విదేశాల్లో కూడా విడుదలై ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఏకంగా 123 దేశాల్లో విడుదలైన ఈ చిత్రం అప్పటిలో బాహుబలి రేంజ్ సక్సెస్ ను సొంతం చేసుకుంది..

Read more RELATED
Recommended to you

Latest news