ఆరెంజ్‌ తొక్క తీసేసి తింటున్నారా..? ఈ తొక్కల్లోనే ఉంది అసలు విషయం..!!

-

కొన్ని పండ్లను తొక్కతీసి తినాలి..మరికొన్నింటిని తొక్కతో సహా తింటేనే అందులోని పోషకాలను పూర్తిగా గ్రహించుకోగలుగుతాం. కానీ మనకు ఏవి ఎలా తినాలో సరిగ్గా తెలియక.. అన్నింటికి తొక్క తీసేసే తింటాం. అయితే తొక్కను డైరెక్టుగా తినడానికి వీలుకాదు.. అలా అని పారేయడం కరెక్టు కాదు. వాటిని వాడే తీరులో వాడితే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఆరెంజ్‌ అంటే ఎవరైనా తొక్క తీసే తింటారు. కానీ పండులో కంటే.. రెండింతలు విటమిన్‌ సీ ఆ తొక్కలోనే ఉంటుంది తెలుసా..? మరి అది ఎలా తినడం..?

ఆరెంజ్

నారింజలో విటమిన్ సి ఉంటుంది. కానీ ఇక్కడ పండులో కంటే తొక్కలో విటమిన్ సి రెండింతలు ఎక్కువగా ఉంటుంది. విటమిన్ బి6, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, రైబోఫ్లావిన్ వంటి పోషకాలు నారింజ తొక్కలో సమృద్ధిగా ఉన్నాయి. కానీ ఆరెంజ్ తొక్క తింటే అది సులభంగా జీర్ణం కాదు. కాబట్టి తొక్కను తురముకోవాలి. నారింజ తురుమును కొద్దికొద్దిగా సలాడ్లు, ఆహార పదార్థాలు, పానీయాలలో పై నుంని గార్నిష్ చేసుకోవచ్చు. అలాగే ఎండబెట్టి వంటల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ రకంగా పండులోని పోషకాలు పూర్తిగా పొందవచ్చు.

బంగాళదుంప

ఆలుగడ్డలలో లోపల ఉండే దుంప కంటే, పైన ఉండే చర్మంలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని మీకు తెలుసా..? తొక్క తీసి వండిన బంగాళదుంపల కంటే చర్మంతో కలిపి వండిన బంగాళదుంపలు తింటే విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్, ఎక్కువ మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు అందుతాయి.. బంగాళదుంప తొక్కలలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ ఫైబర్ సంపూర్ణత్వం అనుభూతిని అందిస్తుంది , ఆకలిని అదుపులో ఉంచుతుంది.

పుచ్చకాయ

పుచ్చకాయ తొక్కా అని షాక్‌ అవకండి..దీని తొక్కలో సిట్రులిన్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఇది కండరాల నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తం నుండి నత్రజనిని తొలగించడంలో సహాయపడుతుంది. గుజ్జులో కంటే పుచ్చకాయ తొక్కలో సిట్రులైన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయ తొక్కను వేయించి కూరగాయగా తినవచ్చు. మీకు కావాలంటే, దాని నుండి ఊరగాయను తయారు చేసుకోవచ్చు. పుచ్చకాయ తొక్కతో హల్వా కూడా చేస్తారు.

దోసకాయ

దోసకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా మంది దీని తొక్క గీకేసి తింటారు. కానీ దీనిని పొట్టుతో కలిపి తింటే పోషకాలు ఎక్కువగా లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దోసకాయ తొక్కలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో విటమిన్ కె ఉంటుంది, ఇది ఎముకలను బలోపేతం చేస్తుంది, రక్తం గడ్డకట్టడంలో అవసరం అవుతుంది. దోసకాయ తొక్క చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరిచే ఫైబర్ కలిగి ఉంటుంది.
పండ్లలో కంటే తొక్కలోనే 25-30 శాతం పోషకాలు అధికంగా ఉంటాయని నిపుణులు అంటున్నారు. కూరగాయలలో 31 శాతం పీచు తొక్కలోనే ఉంటుంది. కాబట్టి ఇప్పట్నించి ఏదైనా తినేటపుడు తొక్కే కదా అని తీసి పారేయకుండా, తొక్కతో కలిపి తినండి.

Read more RELATED
Recommended to you

Latest news