నిలిచిన ఇండియన్ రేసింగ్ లీగ్.. కారణం ఇదే..

-

హైదరాబాదులో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) కొన్ని కారణాల వల్ల ముందే ముగిసింది. వెలుతురు తగ్గిపోవడంతో రెండో రోజు రేసింగ్ పోటీలను కాస్త ముందుగానే నిలిపివేశారు నిర్వాహకులు. కేవలం ఫార్ములా-4 రేస్ తోనే సరిపెట్టారు. ఈ సాయంత్రం క్వాలిఫైయింగ్ రేసులో రెండు కార్లు ఢీకొనడం, ఓ మహిళా రేసర్ గాయపడిన ఘటనతో రేసు ఆలస్యమైంది. దీంతో నిర్ణీత సమయంలో లోపు రేసు పూర్తి కాకపోవడం, హైదరాబాదులో వెలుతురు మందగించడంతో ఐఆర్ఎల్ నిర్వాహకులు రేసును నిలిపివేశారు.

Indian Racing League gives people of Hyderabad a taste of race cars in  their backyard

ఇక్కడి రేసింగ్ ట్రాక్ లో పోటీలు నిర్వహించేందుకు రెండు రోజులే అనుమతి ఉండడంతో రేపు (నవంబరు 21) రేసు కొనసాగించేందుకు వీల్లేకుండా పోయింది. హైదరాబాదులో నిన్నటి నుంచి ఐఆర్ఎల్ పోటీలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ రేసింగ్‌ పోటీలను వీక్షించేందుకు వచ్చిన అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. మొట్టమొదటి సారి జరుగుతున్న రేసింగ్‌ కావడంతో భారీ సంఖ్యలో గ్యాలరీల వద్దకు అభిమానులు చేరుకున్నారు. అయితే.. మళ్లీ డిసెంబర్‌ ఈ పోటీలు ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news