రంగారెడ్డిలో మరో విషాదం.. ఈతకు వెళ్లిన ఇద్దరు అనంతలోకాలకు

రంగారెడ్డి జిల్లాశంషాబాద్ మండలంలోని నానాజీపూర్ వాటర్ ఫాల్స్ లో కి ఈతకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు ప్రమాదవశాత్తు నీటి లో మునిగి మృతి చెందారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఇద్దరు వేరు వేరు కుటుంబాలకు సంబంధించిన వారు. ఒకరు మరి నాగరాజు (45) చాకలి. ఇతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. వృత్తి రిత్యా ఇస్తిరి షాప్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మరొకరు మైలారం రాజు (32 ) ఇతనికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె వృత్తిరీత్యా డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

Why Does Dead Body Floats And Living Person Sinks In Water - ज्ञान की बात:  आखिर जिंदा व्यक्ति पानी में डूब जाता है, लेकिन शव क्यों तैरने लगता है? -  Amar Ujala

ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు కార్మికులు ఒకేసారి మృతిచెందడంతో ఆ గ్రామానికి చెందిన రెండు కుటుంబాలు రోడ్డున పడ్డాయి ప్రభుత్వం వారి కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇదిలా ఉంటే నిన్న హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడలో విషాదం జరిగింది. ఈతకు వెళ్లిన విద్యార్థులు విగతజీవులగా మారిని ఘటన గచ్చిబౌలి చోటు చేసుకుంది. గచ్చిబౌలి టెలికాంనగర్‌లోని ఓ పాఠశాలలో చదువుకుంటున్న తొమ్మిది మంది విద్యార్థులు నానక్‌రామ్‌గూడ గోల్ఫ్‌ కోర్స్‌ సమీపంలో ఉన్న చెరువులోకి ఈతకు వెళ్లారు. వారిలో ముగ్గురు చెరువులో లోతు గమనించకుండా దిగడంతో ఈత రాక నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు.