క్యాసినో కేసులో ముగిసిన మంత్రి తలసాని పీఏ విచారణ

-

క్యాసినో కేసులో ఈడీ అధికారులు తెలంగాణ మంత్రి తలసాని పీఏ హరీష్ ను సోమవారంనాడు ఏడు గంటలపాటు విచారించారు.
క్యాసినో కేసులో విచారణకు రావాలని ఈ నెల 18వ తేదీన హరీష్ కు నోటీసులు పంపారు ఈడీ అధికారులు. నోటీసుల మేరకు
హరీష్ ఇవాళ ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ హరీష్ కు చెందిన
బ్యాంకు ఖాతాలను ఈడీ అధికారులు పరిశీలించారు. క్యాసినో కేసులో సుమారు 130 మంది జాబితాను ఈడీ అధికారులు తయారు చేశారు. ఈ జాబితా ఆధారంగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు హరీష్ ను విచారించారు. క్యాసినో ఆడేందుకు వెళ్లిన సమయంలో నగదు లావాదేవీలు ఎలా చేశారనే విషయాలపై ఆరా తీశారు. గోవాతో పాటు విదేశాలకు వెళ్లిన సమయంలో నగదు చెల్లింపులను ఎలా చేశారనే విషయమై ఈడీ అధికారులు ప్రశ్నించారు.

Delhi Liquor Scam: Fresh ED raids in Telugu states, search at 40 locations  underway

క్యాసినో వ్యాపారం చేస్తున్న చీకోటి ప్రవీణ్ కుమార్ తో ఎలా సంబంధాలు ఏర్పడ్డాయనే విషయమై కూడా ఈడీ
అధికారులు హరీష్ ను ప్రశ్నించారు. క్యాసినో కేసులో ఈ ఏడాది ఆగస్టు మాసంలో చీకోటి ప్రవీణ్ కుమార్ ను ఈడీ అధికారులు
ప్రశ్నించారు. చీకోటి ప్రవీణ్ బ్యాంకు లావాదేవీలను ఈడీ అధికారులు ప్రశ్నించారు,క్యాసినో విషయంలోనే తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు నేతలకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.ఈ నెల 18న ఈడీ విచారణకు హాజరైన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news