ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా.. మత్స్యకారులకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సన్మానం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. బలహీన వర్గాల ప్రజలందరికీ బీమా కల్పించాలన్నారు మత్స్యకారుల వృత్తికి భద్రత కల్పించాలని తెలిపారు జీవన్ రెడ్డి. వారి బతుకు దెరువు కోసం తక్షణమే చెరువులను పునరుద్ధరించాలని కోరారు జీవన్ రెడ్డి. చేప పిల్లల పంపిణీలో దళారులను తొలగించాలని సూచించారు. మత్స్యకార సొసైటీలకు నగదు బదిలీ చేయాలని జీవన్ రెడ్డి చెప్పారు. గంగపుత్రులకు సంక్షేమ పథకాలను నిరంతరం అమలు చేయాలని సూచించారు. కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని..రాష్ట్ర ప్రభుత్వ వైఖరితో ప్రజలు హక్కులను కోల్పోతున్నారని జీవన్ రెడ్డి తెలిపారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఓటమికి సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు జీవన్ రెడ్డి. గత పార్లమెంటు ఎన్నికల్లో కవితకు ఆమె సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే వెన్నుపోటు పొడిచారని అన్నారు. కవిత గెలిస్తే తమపై ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందనే భావనతో ఆమెను ఓడించారని జీవన్ రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పడిన ఓట్లు కవితకు ఎందుకు పడలేదని ఎద్దేవా చేశారు జీవన్ రెడ్డి.