నయనతార లో ఈ కోణం కూడా ఉందా..! తెలుసుకొని షాక్ అవుతున్న అభిమానులు..

-

Entertainment కొందరు హీరోయిన్స్ నిత్యం ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు అందులో ముందు ఉంటుంది మన కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార కెరియర్ పరంగా ఎంత పాపులర్ అయిందో తన పర్సనల్ లైఫ్ విషయం కూడా ఎప్పటికప్పుడు అంతే హాట్ టాపిక్ గా మారుతూ వస్తుంది. అయితే నయనతార కోసం అభిమానులకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి..

నయనతార ఎప్పుడు ఏవో ఒక వార్తలతో నిత్యం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటుంది.. అయితే కెరీర్ ఎఫైర్స్ విషయంలో ఎలా ఉన్నా.. వ్యక్తిత్వం పరంగా నయనతార ఎంతో మంచి మనిషి అని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.. ఆమె అందం నటనే కాకుండా ఆమెలో మరో కోణం కూడా ఉందంటూ చెప్పుకొస్తున్నారు..

అయితే అందంతోపాటు.. నయనతార వ్యక్తిత్వానికి కూడా ఎందరో అభిమానులు ఉన్నారు. నిజానికి నయనతార క్రిస్టియన్.. ఆమె చిన్నతనం నుండి ఎంతో సున్నిత మనస్కురాలు… అలాగే ఎవరైనా తన దగ్గరకు వచ్చి కష్టం అంటే వెంటనే చలించిపోతుందంట.. అలాగే తన ఇంటిలో పని చేసే పని వాళ్ళ నుంచి కారు డ్రైవర్ వరకు అందర్నీ సొంత మనుషుల్లా ఎంతో అభిమానం గా పలకరించడమే కాకుండా వారందరికీ ఏం కావాలన్నా చేసి పెడుతుందట. వారిని తన ఇంట్లో మనుషుల్లానే చూసుకుంటూ వస్తుందంట.. అలాగే నయంతార ఎవరిని ప్రేమించిన ఆ విషయాన్ని తాను సీక్రెట్ గా ఉంచుకోవాలని అనుకోదు.. నిజంగా ప్రేమిస్తూ పెళ్లి వరకు తీసుకువెళ్లాలని ఆలోచనతో సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలోనే తను తమిళ హీరో శింబుతో ప్రేమలో ఉన్నప్పుడు వారు లిప్ కిస్ విషయాన్ని కూడా సోషల్ మీడియాలో ఉంచింది.. అయితే ఈ విషయం అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపింది.. అలాగే పెళ్లి ఇద్దరు పిల్లలు ఉన్నా ప్రభుదేవాను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఆ విషయాన్ని అందరి ముందు చెప్పింది అయితే ఇవి ఏవి పెళ్ళి వరకు వెళ్లలేదు.. చివరికి విజ్ఞేశ్ ను పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన సంగతి తెలిసిందే..

 

Read more RELATED
Recommended to you

Latest news