ఇవాళ మధ్యాహ్నం గుండె, మూత్రపిండాల సమస్యతో జైట్లీ అనారోగ్యానికి గురవడంతో వెంటనే ఎయిమ్స్ కు తరలించారు. గత కొంత కాలంగా జైట్లీ అనారోగ్య సమస్యతో బాధ పడుతున్న విషయం తెలిసిందే.
బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది.
ఇవాళ మధ్యాహ్నం గుండె, మూత్రపిండాల సమస్యతో జైట్లీ అనారోగ్యానికి గురవడంతో వెంటనే ఎయిమ్స్ కు తరలించారు. గత కొంత కాలంగా జైట్లీ అనారోగ్య సమస్యతో బాధ పడుతున్న విషయం తెలిసిందే.
గత సంవత్సరమే అరుణ్ జైట్లీ మూత్రపిండాల మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నారు. గత మే నెలలోనూ ఎయిమ్స్ లో కొన్నిరోజులు జైట్లీ చికిత్స చేయించుకున్నారు.
ఈ ఏడాది జనవరిలోనూ అరుణ్ జైట్లీ… కిడ్నీకి సంబంధించిన చికిత్సను అమెరికాలో చేయించుకున్నారు. ఆయన అనారోగ్య సమస్యల వల్లనే రెండోసారి మోదీ ప్రభుత్వం ఏర్పడినా… మంత్రి పదవిని తిరస్కరించారు.
ఎయిమ్స్ కు ప్రధాని మోదీ, అమిత్ షా
ఎయిమ్స్ లో అరుణ్ జైట్లీ జాయిన్ అయిన విషయం తెలియగానే… ప్రధాని మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, హర్షవర్ధన్, అశ్వనీ చౌబే ఎయిమ్స్ కు చేరుకున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.