బాహుబలి 2 తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం.. సాహో.. ప్రభాస్ అభిమానులే కాదు, యావత్ సినీ ప్రేక్షకులు కూడా సాహో ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
బాహుబలి 2 తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం.. సాహో.. ప్రభాస్ అభిమానులే కాదు, యావత్ సినీ ప్రేక్షకులు కూడా సాహో ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే అందరి అంచనాలకు తగినట్లుగానే భారీ యాక్షన్ సన్నివేశాలతో కూడిన సాహో మూవీ ట్రైలర్‌ను గత కొద్ది నిమిషాల కిందటే చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో ప్రభాస్ నటించిన కొన్ని సీన్లను చూస్తుంటే నిజంగా అభిమానులకు పూనకం వస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు.
అప్పట్లో సంచలన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహబలి (2 పార్ట్‌లు) ఎంత సక్సెస్ సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే ప్రభాస్ రేంజ్‌కు తగినట్లుగానే సాహో చిత్రాన్ని తెరకెక్కించారు. దర్శకుడు సుజిత్ ఈ చిత్రాన్ని ఒక చాలెంజ్‌గా తీసుకుని తెరకెక్కించాడని మనకు ఇప్పటికే విడుదలైన పోస్టర్, టీజర్స్‌ను చూస్తే తెలుస్తుంది. దాదాపుగా రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఇందులో ప్రభాస్ సరసన ప్రముఖ బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.
బాహుబలితో అంతర్జాతీయ స్టార్‌డం దక్కించుకున్న ప్రభాస్‌కు సాహో ఇంకా మంచి పేరు తెస్తుందని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలోనే అభిమానులను అలరించే మాస్, యాక్షన్ సన్నివేశాలన్నీ సాహో మూవీలో పుష్కలంగా ఉన్నాయని మనకు ఇప్పటికే ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఇక ఈ మూవీని ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తుండగా.. మొత్తానికి ఎంతో కాలంగా వేచి చూస్తున్న ప్రభాస్ అభిమానుల సినీ దాహం ఇప్పుడు తీరనుంది. ఇక వారికి ఈ నెలంతా పండగనే చెప్పవచ్చు..!