Ginna : ‘జిన్నా’ ఓటీటీలోకి వచ్చేసిన.. ఎందులో స్ట్రీమింగ్‌ అంటే ?

-

టాలీవుడ్ లో హీరోగా గుర్తింపు తెచ్చుకొని మంచి పేరు ప్రఖ్యాతలు ఘడించి.. మోహన్ బాబు వారసులుగా మంచు విష్ణు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇటీవల ఈయన మా అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఇషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు నటించిన చిత్రం జిన్నా.

ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ ఊహించని స్థాయిలో కలెక్షన్ అయితే రాబట్టలేదు. ఇది ఇలా ఉంటే అక్టోబర్ 21వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మొత్తానికి ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ రెండో తేదీన అంటే ఇవాల్టి నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news