కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ ద్వారా చాలా మంది లాభాలని పొందుతున్నారు. రైతులకి, కార్మికులకు ఇలా అందరి కోసం కేంద్రం పథకాల్ని ప్రవేశ పెడుతూ వుంది. అలానే గర్భిణీల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా కొన్ని స్కీమ్స్ ని కేంద్రం తీసుకు రావడం జరిగింది.
దీని వలన తల్లితో పాటు పుట్టబోయే బిడ్డ సంరక్షణ కోసం కూడా ఈ డబ్బులు సహాయ పడతాయి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. కేంద్రం గర్భిణీల కోసం తీసుకు వచ్చిన ఈ స్కీమ్ పేరు జననీ సురక్ష యోజన. జననీ సురక్ష యోజన పధకం ద్వారా గర్భిణీలు, నవజాత శిశువులకు సాయం అందిస్తున్నారు. చాలా మంది గర్భిణీలు ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ ని పొందుతున్నారు.
జననీ సురక్ష యోజన పధకం తో ఎంత వస్తాయి..?
గర్భిణీలు, నవజాత శిశువుల ఆరోగ్యం కోసం ఈ స్కీమ్ ని తీసుకు వచ్చారు.
ఈ పథకం ద్వారా మహిళలకు రూ. 6000 వేలు ఆర్థిక సహాయం ఇస్తున్నారు. సరిపడా పోషకాహారం పిల్లలకి ఉండాలనే ఈ స్కీమ్ ని తీసుకు వచ్చారు.
ఎవరికి జననీ సురక్ష యోజన పధకం వర్తిస్తుంది..?
ప్రసవం తర్వాత గర్భిణులకు ఈ డబ్బులని ఇస్తారు. ఈ స్కీమ్ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వర్తిస్తుంది.
ఎలా ఈ స్కీమ్ బెనిఫిట్స్ ని పొందొచ్చు..?
దీని కోసం మీరు ఆశా వర్కర్లను సంప్రదించాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక గ్రామంలో ఆశా వర్కర్లు లేకపోతే గ్రామాధికారికి కలిస్తే చాలు.
కావాల్సిన డాక్యుమెంట్స్:
ఆధార్డ్ కార్డు
ఓటర్ ఐడీ కార్డు
ఆసుపత్రి జారీ చేసిన డెలివరీ సర్టిఫికేట్
బ్యాంక్ అకౌంట్ నెంబర్
ఈ పైన ఉన్న డాక్యుమెంట్స్ తో పాటుగా మీరు అప్లికేషన్ఫామ్ ని ఇవ్వాల్సి వుంది. దీనితో గర్భిణీలకు జననీ సురక్ష యోజన పధకం డబ్బులు వస్తాయి.