కొత్త బిచ్చగాడిలా రోడ్డున పడ్డావేంటి బాబూ?: విజయసాయి

-

ఐటీ ఉద్యోగులు టీడీపీకి రాయల్టీ (పార్టీ ఫండ్) ఇవ్వాలన్న చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. ‘కొత్త బిచ్చగాడిలా ఇలా రోడ్డున పడ్డావేంటి చంద్రం అన్నయ్యా? యువత కష్టపడి ఉద్యోగాలు తెచ్చుకుంటే నీకు కప్పం / రాయల్టీ కట్టాలంటూ నీ కుప్పిగంతులు యువతకు నచ్చట్లేదు. అయినా ఇలా వీధుల్లో డబ్బులు అడుక్కోవడం నీకే చెల్లింది బాబన్నయ్యా!’ అని ఎద్దేవా చేస్తూ వీడియో ట్వీట్ చేశారు. అంతేకాదు చంద్రబాబు ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద స్పందన లేదని పేర్కొన్న విజయసాయిరెడ్డి, పచ్చ మీడియా పైత్యం తప్పా చంద్రబాబు సభలో జనం కనిపించడం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. 100 కిలోమీటర్ల మేర జన ప్రవాహం అంటూ ఒక పత్రిక రాసిన వార్తను ఉటంకించి చేతికొచ్చింది రాయడం, నోటికొచ్చింది మాట్లాడ్డం పరిస్థితులపై కూడా భాగమే అయినా, ఇప్పుడు ఇది బాగా ముదిరిపోయింది అంటూ టార్గెట్ చేశారు.

గేమ్స్ ఆడుతున్నావ్..!అంటూ..చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేసిన వైసీపీ ఎంపీ |  TV9 Telugu

2024లో కాయకల్ప చికిత్స చేయాల్సిందేనని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు ఓటమి భయం వెంటాడినప్పుడల్లా మూడు రకాల రాజకీయాలు చేస్తాడంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. మూడు రకాల క్షుద్ర పన్నాగాలను చంద్రబాబు ప్రదర్శిస్తారని చంద్రబాబును టార్గెట్ చేశారు. చంద్రబాబు ఓడిపోతామని భావించినపుడు మూడు రకాల క్షుద్ర పన్నాగాలు ప్రదర్శిస్తారని అందులో సానుభూతి ఒకటని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. దురాశతో తనపై తనే దాడి చేసుకోవడానికి చంద్రబాబు స్కెచ్ వేస్తాడని, అప్పట్లో మల్లెల బాబ్జీ ప్లాన్ ఇతనిదే అని చంద్రబాబు పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news