తెలంగాణలో మరో కొత్త పథకం.. వారం,10 రోజుల్లోనే ప్రారంభం

-

తెలంగాణలో మరో కొత్త పథకం తెరపైకి వచ్చింది. మరో వారం 10 రోజుల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్స్ ప్రారంభిస్తామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. కామారెడ్డి జిల్లా పిట్లంలో 30 పడకల సి హెచ్ సి ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేసి, వ్యవసాయ మార్కెట్ వాణిజ్య దుకాణముల సముదాయం ప్రారంభోత్సవంలో హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడ్డాక వైద్యారోగ్యం ఎంతో అభివృద్ధి చెందిందని.. డయాలసిస్ పేషంట్ల సమస్యలు గుర్తించిన సీఎం కేసీఆర్ అందుబాటులోనే కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

తెలంగాణ ఏర్పాటుకు ముందు 3 డయాలసిస్ సెంటర్లు ఉంటే, ఇప్పుడు 83 కు పెంచుకున్నాం… మొన్ననే 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించాం. 157 మెడికల్ కాలేజీల్లో తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీని కూడా కేంద్రం ఇవ్వలేదన్నారు. కామారెడ్డిలో మెడికల్ కాలేజీ ప్రారంభిస్తాం. మంచి వైద్యం ఇంకా అందుబాటులోకి వస్తుంది. న్యూట్రిషన్ కిట్ ఇస్తాము. కామారెడ్డి జిల్లాలో కూడా ప్రారంభిస్తాం. గర్భిణులకు ఎంత మంది ఉంటే, అంత మందికి ఇస్తామన్నారు. మాతృ మరణాలు తగ్గించడంలో తెలంగాణ అగ్ర స్థానమని.. ఎంఎంఆర్ 92 నుండి 43 కు తగ్గిందని వెల్లడించారు. డబుల్ ఇంజిన్ రాష్ట్రాలు వెనుక బడి ఉన్నాయి.. కేంద్ర మంత్రి వచ్చి మనల్ని విమర్శిస్తారు. నీ ఉత్తర్ ప్రదేశ్ చివరి స్థానంలో ఉందని విమర్శలు చేశారు. మాది సంక్షేమ రాష్ట్రం మీది సంక్షోభ పాలన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news