ఈ నెల 28న హైదరాబాద్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ రానున్నారు. వీరితో పాటు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ సునీల్ బన్సల్, తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఇంచార్జ్ తురుణ్‌ఛుగ్ కూడా రానున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు, ఢిల్లీ లిక్కర్ స్కాం, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో రోజుకో కీలక పరిణామం జరుగుతున్న సమయంలో అమిత్ షా, బీఎల్ సంతోష్ పర్యటన ఉత్కంఠగా మారింది. టీఆర్‌ఎ్‌సతో ఢీ అంటే ఢీ అంటున్న సందర్భంలో బీజేపీ కీలకమైన సదస్సుకు హైదరాబాద్‌ను వేదికగా చేసుకున్నారు.
ఈనెల 28, 29 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల పార్లమెంటు నియోజకవర్గ విస్తారక్ (పూర్తి స్థాయి కార్యకర్తలు)ల శిక్షణ సదస్సు నిర్వహించనుంది. దక్షిణాదిలో 80 లోక్‌సభ నియోజకవర్గాల విస్తారక్‌లు పాల్గొనే ఈ సదస్సుకు బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు సునీల్ బన్సల్, తరుణ్‌ఛుగ్ హాజరవుతారు. దక్షిణాది రాష్ట్రాల్లోని 60 లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన కార్యకర్తలు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహలు, పార్టీ బలోపేతం, ప్రచారశైలిపై కార్యకర్తలకు నేతలు ట్రైనింగ్ ఇవ్వనున్నారు.