LIC: రూ.45 పెడితే.. రూ.25 లక్షలు..ఈ ప్రయోజనాలు కూడా..!

-

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆఫ్‌ కార్పొరేషన్‌ ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన చాలా మందికి బెనిఫిట్ కలగనుంది. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎక్కువ రాబడి ఈ స్కీమ్స్ ద్వారా పొందొచ్చు. ఈ స్కీమ్స్ లో మీరు పెట్టుబడి పెట్టడం వలన ఎలాంటి రిస్క్ కూడా ఉండదు.

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఆఫ్‌ కార్పొరేషన్‌ అందించే వాటిల్లో జీవన్ ఆనంద్ పాలసీ ఒకటి. ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే కొన్ని సంవత్సరాల తర్వాత మీకు భారీ మొత్తం వస్తుంది. మెచ్యూరిటీ ప్రయోజనాలను కూడా పొందవచ్చు. LIC అందించే స్కీమ్ లో జీవన్ ఆనంద్ పథకం ఒకటి. జీవన్ ఆనంద్ పాలసీలో నెలకు రూ.1358 డిపాజిట్ చేస్తే రూ.25 లక్షలు పొందవచ్చు.

జీవన్ ఆనంద్ పాలసీ తో బోనస్ ప్రయోజనం:

ఇందులో 35 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ పూర్తయిన తర్వాత రూ. 25 లక్షల రాబడి లభిస్తుంది. రోజుకు రూ.45 మాత్రమే పొదుపు చేయాలి.
ఒక నెలలో 1358 రూపాయలు వస్తాయి.
ఒక సంవత్సరంలో సుమారు 16,300 రూపాయలు వస్తాయి.
35 సంవత్సరాలలో మొత్తం రూ.5.70 లక్షలు డిపాజిట్ చేస్తారు. ప్రాథమిక హామీ మొత్తం ఐదు లక్షల రూపాయలు. దీనితో పాటుగా రూ.8.60 లక్షల రివిజనల్ బోనస్, రూ.11.50 లక్షల చివరి అదనపు బోనస్ వస్తుంది.
బోనస్ కూడా రెండు సార్లు వస్తుంది.
పన్ను మినహాయింపు ఉండదు.
పాలసీదారుడు ఏదైనా కారణం వల్ల మరణిస్తే 125% మరణ ప్రయోజనాన్ని పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news