తిప్పతీగతో ఎవరికీ తెలియని లాభాలు ఇవే..!

-

తిప్పతీగ అనేక ఔషధ గుణాలను, రక్షణ వ్యవస్థను పెంచే గుణాలను కలిగి ఉందని నిపుణులు తెలియచేసారు. ఈ మొక్క పల్లెటూర్లల్లో పంట పొలాల మీద, గట్ల మీద, పిచ్చి పొదల్లో అలా ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా పాకి ఉంటుంది. ఇందులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయని ఆయుర్వేద వైద్యశాస్త్రంలో ఏనాడో గుర్తించి దాని ఉపయోగాన్ని సమాజానికి అందించడం జరిగింది. కానీ ఎక్కువ మందికి జనాల్లోకి వెళ్ళలేదు. కానీ ఈ మధ్య కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఈ తిప్పతీగ చాలా బాగా ఫేమస్ అయ్యింది. ఇలాంటి తిప్పతీగలో ఏమేమి లాభాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

తిప్పతీగ యొక్క లాభాలు :
తిప్పతీగలో ఔషధ గుణాలు..35 రకాలకి పైగా ఫైటో కెమికల్స్ ఉన్నాయని గుర్తించడం జరిగింది. ఈ 35 రకాల లో ముఖ్యంగా 15 రకాల ఆల్కలైడ్స్, ఆరు రకాలు గ్లైకోసైడ్స్,5 రకాల లైటర్ ఫినాయిడ్స్, 4 రకాల జిరాయిడ్స్ 5 రకాల ఆలీ ఫ్యాటీ కాంపౌండ్స్ ఉన్నాయి.

తిప్పతీగ ఆకుల చూర్ణంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.సీజన్లో వచ్చే జ్వరాలు,వ్యాధులు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది.తిప్పతీగలో ఉండే యాంటీ బయోటిక్,యాంటీ వైరల్, యాంటీ ఫంగస్ శరీరంలో చేరి సూక్ష్మ క్రిములు నాశనం చేస్తాయి.తిప్పతీగ ఆకులు పొడిని బెల్లంలో కలుపుకుని ప్రతిరోజు తీసుకుంటే అజీర్తి తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు చాలా బాగా మెరుగుపడుతుంది.డయాబెటిస్ ఉన్నవారు తిప్పతీగ చూర్ణాన్ని నిత్యం ఉదయం, సాయంత్రం తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు.

జలుబు, దగ్గు, ట్యాన్సిల్స్ తదితర శ్వాస కోస సమస్యలు ఉన్నవారు తిప్పతీగ చూర్ణాన్ని వాడితే ఫలితం ఉంటుంది.గోరువెచ్చని పాలల్లో కొద్దిగా తిప్పతీగ చూర్ణం, అల్లం రసం కలిపి రోజు రెండు పూటలా తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వీటితోపాటు మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు మన శరీరానికి లభిస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news