సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారికి TSRTC గుడ్ న్యూస్

-

సంక్రాంతికి సొంత గ్రామాలకు వెళ్లే ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. సంతూర్లకు వెళ్లే వారి కోసం ఏకంగా 4233 స్పెషల్ ఆర్టీసీ బస్సులను నడపాలని నిర్ణయం తీసుకుంది తెలంగాణ ఆర్టీసీ సంస్థ. వచ్చే ఏడాది జనవరి 7వ నుంచి 15 వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు నడవనన్నట్లు కీలక ప్రకటన చేసింది ఆర్టీసీ.

వీటిలో 585 బస్సు సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కూడా కల్పించారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంక్రాంతికి 10 శాతం బస్సులను అదనంగా నడుపుతున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనర్ కీలక ప్రకటన చేశారు. ఈ ప్రత్యేక బస్సులను తెలంగాణతో పాటు ఏపీకి కూడా నడిపిస్తామని వెల్లడించారు. ఈ అవకాశాన్ని ప్రతి ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news