రష్మిక మాటలను తిప్పి కొట్టిన కన్నడ సంస్థలు.. ఏమైందంటే..!

-

నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న పాన్ ఇండియన్ హీరోయిన్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చలో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగపెట్టిన ఈమె అనతి కాలంలోనే స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. అలా సరిలేరు నీకెవరు సినిమాలో ఏకంగా మహేష్ బాబు సరసన అవకాశాన్ని దక్కించుకొని మరింత ఇమేజ్ను సొంతం చేసుకున్న ఈమె ఇటీవల పుష్ప సినిమాలో నటించి భారీ పాపులారిటీని దక్కించుకుంది. అంతేకాదు అదే గుర్తింపుతో బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.

ఇకపోతే ఇటీవల కన్నడ ఇండస్ట్రీ నుంచి ఈమె విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. కాంతార సినిమాను చూడలేదని తెలిపి కన్నడ ప్రేక్షకుల ఆగ్రహానికి గురవ్వడమే కాకుండా మరొక పక్క మాతృభాష కన్నడ అయినా కన్నడ స్పష్టంగా మాట్లాడడం రాదు అని చెప్పి మాతృభాషను అవమానపరిచింది అంటూ మరికొంతమంది ఈమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే కన్నడ ఇండస్ట్రీలో కొన్ని వర్గాల ప్రేక్షకులు రష్మికపై బ్యాన్ విధించాలి అంటూ పెద్ద ఎత్తున కన్నడ ఇండస్ట్రీ సంస్థలకు ఒత్తిడి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోని రష్మిక ను బ్యాన్ చేస్తున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి.

అయితే ఈ విషయంపై రష్మిక స్పందించి తనను ఏ ఇండస్ట్రీ బ్యాన్ చేయలేదు అంటూ స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు ఈ వార్తలు కాస్త కన్నడ సంస్థల దృష్టికి వెళ్లడంతో వారు క్లారిటీ ఇచ్చారు. కన్నడ సినిమాల్లో నన్ను నిషేధించలేదని నటి రష్మిక మందన్న చెప్పారు, అయితే కన్నడ సంస్థలు మాత్రం తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే తెలియజేస్తామని స్పష్టం చేసింది. దీన్నిబట్టి చూస్తే రష్మిక అబద్ధం చెప్పిందని స్పష్టమవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news