Breaking : తిరుపతిలో మాండూస్‌ ఎఫెక్ట్‌.. ఆలయ ప్రాంగణం జలమయం

-

మాండూస్‌ తుఫాన్‌ ఏపీలో బీభత్సం సృష్టిస్తోంది. మాండూస్ తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి తిరుమల క్షేత్రంలో నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత అధికంగా ఉండడంతో దర్శనం అనంతరం భక్తులు కొండ నుంచి తిరుగు పయనమవుతున్నారు.

Cyclone Mandous impact intensifies in Tirupati

కాగా, తిరుమలలో ఓ భారీ వృక్షం కూలిపోయి భక్తురాలికి గాయాలయ్యాయి. అటు శ్రీవారి మెట్టు మార్గంలో భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో, టీటీడీ అప్రమత్తం అయింది. కొండచరియలు విరిగిపడే ప్రాంతాల్లో భక్తుల రాకపోకలు నిలిపివేసింది. శ్రీవారి మెట్టు మార్గంపై నడిచి వెళ్లే భక్తులను అనుమతించడంలేదు. పాపనాశనం, శిలాతోరణం మార్గాలను మూసివేసింది. తిరుమలలోని అన్ని జలాశయాల్లో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news