కాస్టింగ్ కౌచ్ పై మొదటి సారి స్పందించిన ఇనయ..!!

-

బిగ్ బాస్ సీజన్ 6 లో బాగా పాపులర్ అయిన కంటెస్టెంట్ ఎవరంటే టక్కున ఇనయా సుల్తానా పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. ఎన్నో ఇంటర్వ్యూలతో యాంకర్ గా పాపులర్ అయిన ఇనయా సుల్తానా వర్మతో డాన్స్ చేసిన కేవలం ఒక్క వీడియోతో మరింత పాపులర్ అయింది. ఇక ఈ క్రేజ్ తోనే ఈమెకు బిగ్ బాస్ లో అవకాశం వచ్చిందని వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. బిగ్ బాస్ లో ప్రేక్షకులను మెప్పిస్తోంది. హౌస్ లో స్ట్రాంగ్ కంటేస్టెంట్ గా ఉన్న ఇనయా సుల్తానా మంచి గుర్తింపు తెచ్చుకుంది టాప్ ఫైవ్ లో ఒకరిగా ఉంటుంది అని కచ్చితంగా రెండవ స్థానంలోనే రన్నర్ గా నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ ఓటింగ్ చూసి మొదటి స్థానంలో నిలిచే అవకాశాలు కూడా ఉన్నాయి అని వార్తలు వైరల్ అవ్వగా..ఎవరూ ఊహించని విధంగా ఆమె ఎలిమినేట్ అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈమె కచ్చితంగా ఎలిమినేట్ అయ్యిందా లేదా అనేది రేపటి ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే. అయితే టాప్ ఫైవ్ లో ఉండాల్సిన కంటెస్టెంట్ ఇలా అర్ధాంతరంగా ఎలిమినేట్ అవ్వడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అయినా ఓట్ల పరంగా అలాగే ప్లేయర్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఇనయా సుల్తానా ఇలా ఉన్నట్టుండి ఎలిమినేట్ అవ్వడంతో ప్రతి ఒక్కరు మరింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.

ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడిన ఈమె కాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆర్జీవి అంటే తనకు గౌరవం అని ఆయన గొప్ప దర్శకుడుని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలోకి రావాలని ఇంటి నుంచి పారిపోయి వచ్చినప్పుడు కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాను అని ఆమె తెలిపింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదని నేను చెప్పను. కానీ ఇష్టం లేకుండా ఏ పని చేయలేము. అందుకే చాలా ఆఫర్లు వచ్చిన సరే నేను చేయలేదు అంటూ స్పష్టం చేసింది ఇనయా..

Read more RELATED
Recommended to you

Latest news