Big News : తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం.. కొత్తగా మరో 3,966 పోస్టుల భర్తీకి ఆమోదం

-

నేడు ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ అయ్యింది. అయితే.. బీఆర్‌ఎస్‌ మారిన తరువాత జరుగుతున్న తొలి కేబినెట్‌ సమావేశం ఇది. అయితే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది కేబినెట్‌. రాష్ట్ర పోలీసు శాఖ‌లో కొత్త పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖను మరింత పటిష్టం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పెరుగుతున్న సాంకేతికత, మారుతున్న సామాజిక పరిస్థితులలో, నేరాల తీరు కూడా మారుతున్న నేపథ్యంలో నేరాల అదుపునకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలనీ, అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించుకోవాలని మంత్రివ‌ర్గం నిర్ణయించింది. నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి తదితర మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్‌ను దెబ్బతీస్తూ శాంతిభద్రతల సమస్యగా పరిణమిస్తున్నాయనీ కేబినెట్‌ చర్చించింది.

Will cut your tongue': Telangana CM KCR warns BJP leaders, hits out at  Union govt | The News Minute

డ్రగ్స్ నేరాలను అరికట్టి నిర్మూలించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, తెలంగాణ సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3,966 పోస్టులను వివిధ కేటగిరీలలో భర్తీ చేయాలని మంత్రివ‌ర్గం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంశాఖను కేబినెట్‌ ఆదేశించింది. వీటితోపాటు.. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో.. శాంతిభద్రతలను మరింతగా మెరుగు పరిచేందుకు, పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి, నూతన పోలీస్ స్టేషన్లు, నూతన సర్కిల్ లు, నూతన డివిజన్ల ఏర్పాటుకు మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news