బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ (BNP) కి చెందిన వేలాది మంది కార్యకర్తలు డాకాలో మహా ర్యాలీ నిర్వహించారు. 2023 డిసెంబర్లో జరిగే బంగ్లా పార్లమెంటు ఎన్నికలకు ముందే హసీనా రాజీనామా చేసి అబద్ధమా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించాలని వారి ప్రధాన డిమాండ్.
అయితే ఈ ర్యాలీ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 20వేల మంది పోలీసులు మోహరించారు. షేక్ హసీనా 2009 నుంచి బంగ్లాదేశ్ ప్రధానిగా వరుసగా ఎన్నికయ్యారు. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఆ దేశంలో కరెంటు కోతలు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై ప్రతిపక్షాలు చాలాకాలంగా ఆందోళనలు చేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఈ నిరసనలు మరింత తీవ్రంగా మారాయి.