రవితేజ “ధమాకా” నుంచి బిగ్ అప్డేట్..!!

-

టాలీవుడ్‌ మాస్ మహరాజా రవితేజ లేటేస్ట్ మూవీ ‘ధమాకా’. యాక్షన్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ సరసన పెళ్లి సందD ఫేమ్ శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తుండగా.. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

 

 

ఈ ఏడాది డిసెంబర్ 23న థియేటర్లలోకి సందడి చేయనుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఈ మూవీ నుండి వరుస అప్డేట్ లు ప్రకటిస్తూ మూవీపై హైప్ ని క్రియేట్ చేస్తున్నారు. కాగా ఈ క్రేజీ ప్రాజెక్టు నుంచి ట్రైలర్ అప్డేట్ బయటికి వచ్చింది. ఈనెల 15న ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news