కేంద్రం అన్నదాతల కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన చాల మంది రైతులు ప్రయోజనాలను పొందుతున్నారు. అయితే కేంద్రం రైతుల కోసం తీసుకు వచ్చిన పథకాల్లో కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం ఒకటి. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ తో చక్కటి లాభాలని పొందొచ్చు. వ్యవసాయం, మత్స్య, పశుసంవర్ధక రంగాలలోని రైతులు అవసరమైన వ్యవసాయ లోన్ ని తీసుకోవచ్చు.
ఈ స్కీమ్ ద్వారా రైతులు తక్కువ వడ్డీకి రుణం తీసుకోవచ్చు. ఈ కార్డు ని బ్యాంకులు ఇస్తాయి. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రైతులు గరిష్టంగా రూ.3 లక్షల వరకు లోన్ ని తీసుకోవచ్చు. అలానే ఈ స్కీమ్ ద్వారా బీమా ని కూడా పొందొచ్చు. ఒకవేళ కనుక శాశ్వత వైకల్యం లేదా మరణిస్తే రూ. 50,000 వరకు కుటుంబానికి వస్తాయి. ఒకవేళ కనుక ఇతర ప్రమాదాలు జరిగితే రూ.25000 వరకు బీమా సదుపాయం వస్తుంది. రూ.1.60 లక్షల వరకు రుణాలకు ఎలాంటి హామీ అక్కర్లేదు.
కిసాన్ క్రెడిట్ కార్డ్ ని పొందేందుకు అర్హులు ఎవరు…?
వయస్సు 18 నుంచి 75 సంవత్సరాల లోపు ఉండాలి.
పొలం పత్రాలు ఉండాలి.
కౌలు రైతులు, మౌఖిక కౌలుదారులు, వాటాదారులు కూడా అర్హులే.
ఎలా అప్లై చేసుకోవాలి..?
దీని కోసం ప్రాసెసింగ్ ఛార్జ్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ కార్డు మీద రైతులకి లోన్ ఇస్తారు. రూ.50,000 వరకు లోన్ ని పొందొచ్చు. సరైన టైం కి లోన్ కట్టేస్తే 3 నుంచి 4 శాతం మేరకు వడ్డీ రాయితీ ఇస్తారు.