ఇలాంటి మంచి పని జీవితంలో ఒక్కసారైన చెయ్యాలి భయ్యా..హ్యాట్సాప్..

-

మన సొంతవారికి కాకుండా, ఏమి సంబంధం లేని వాళ్లతో ఏళ్ల తరబడి చుట్టుపక్కల ఉండేవారి పట్ల కూడా ప్రేమ, ఆప్యాయతలు కలిగి ఉంటారు చాలామంది. ఒకే చోట కలిసి ఉండటంతో వారిని కూడా సొంత కుటుంబ సభ్యుల వలె భావిస్తుంటారు. ఇక చాలా కాలంగా మన చుట్టు ఉండేవారితో మనం సన్నిహితంగా ఉంటారు. అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు మనకు ఇష్టమైన వారిని అప్పుడప్పుడు సర్‌ప్రైజ్ చేస్తారు.. చిన్నప్పటి నుండి మన చుట్టుపక్కల ప్రాంతాల్లో రుచికరమైన ఫుడ్ విక్రయించేవారికి మనం రెగ్యులర్ ఖాతాదారులుగా కూడా మారుతూ ఉంటాం..

కొంతమంది క్రమం తప్పకుండా ఆ దుకాణానికి వెళ్లి ఫుడ్ కొనుక్కుంటూ ఉంటారు. కొన్ని ఫుడ్ స్టాల్స్‌ ఇళ్ల పక్కనే ఉంటాయి. అక్కడి ఆహారం కోసం ఎంతో మంది వస్తుంటారు. వీళ్లను వీధి వ్యాపారులగా కూడా చెబుతుంటారు. స్ట్రీట్ వెండర్స్‌ అని అంటారు. వీరు ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో వ్యాపారం చేస్తూ ఉంటారు.

అందులో పానీపూరీ, భేల్ పూరీ విక్రేతలు ఒకే చోట ఉంటూ కొన్ని సంవత్సరాలుగా వ్యాపారం నిర్వహిస్తూ ఉంటారు. వారితో చాలా మందికి వ్యక్తిగత పరిచయాలు కూడా ఏర్పడతాయి. తాజాగా ఓ భేల్ పూరీ విక్రేతకు.. అదే ప్రాంత నివాసి ఇచ్చిన ఓ బహుమతికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది..

ఆ వీడియోలో ఓ వ్యక్తి భేల్ పూరీ విక్రేతకు సంబంధించిన దుకాణం పేరుతో స్వయంగా తయారుచేసిన సైన్ బోర్డును బహుమతిగా ఇచ్చి సర్‌ప్రైజ్ చేస్తాడు. ఆ సైన్ బోర్డు చూసి భేల్ పూరీ విక్రేత కూడా అవాక్కైనట్లు కనిపిస్తోంది. తాను తన ఇంటి పక్కన ఉన్న భేల్ పూరీ వాలే భయ్యా కోసం ఈ బోర్డు తయారు చేశా.. అనే క్యాప్షన్‌ను కూడా వీడియోతో పోస్టు చేశారు. ఆ వ్యక్తి 35 సంవత్సరాలుగా అదే ప్రదేశంలో నిల్చుని వ్యాపారం చేస్తున్నాడు. ఇదెంతో గ్రేట్‌ అంటూ పేర్కొన్నాడు..ఈ వీడియో ను చూసిన వారంతా ప్రశంసలు కురిపిస్తున్నారు.గ్రేట్ కదా ఇలాంటి మంచిపని ఒకసారైనా చెయ్యాలి..

https://www.instagram.com/reel/Ck2hsZMDC8J/?igshid=YmMyMTA2M2Y=

Read more RELATED
Recommended to you

Latest news