చిరంజీవి సాయం తో సల్మాన్ తో మూవీ కోసం పూరీ ప్రయత్నం..!!

-

విజయ్‌ దేవరకొండ హీరోగా.. మాస్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. భారీ అంచనాల మధ్య ఆగస్టులో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. విజయ్‌, పూరీ జగన్నాథ్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఫ్లాప్‌గా నిలిచింది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌లోకి గ్రాండ్‌గా ఎంట్రీ వేద్దామనుకున్న పూరీ జగన్నాథ్ కు నిరాశే ఎదురైంది. ఇక ఏమంటూ ఈ సినిమా చేశారో కాని ఈ సినిమా వచ్చి చాలా రోజులు అయినా కూడా వివాదాలు వదిలి పెట్టడం లేదు.

రీసెంట్ గా లైగర్ చిత్రానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ కోసం ఛార్మీ, పూరీ జగన్నాథ్ ను పిలిచి విచారించారు. ప్రస్తుతం హోటల్ లో కూర్చొని కథలు రాసుకుంటున్న పూరీ జగన్నాథ్ ఛాన్స్ కోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నారట. మాస్ మహరాజ్ రవితేజ ఛాన్స్ ఇచ్చి నట్లు ప్రచారం జరిగింది కాని అధికారిక ప్రకటన లేదు.ఇక చిరంజీవి పరిచయం ద్వారా సల్మాన్ ఖాన్ ను బుట్టలో వేయాలని చూస్తున్నాడట. చిరంజీవిని సల్మాన్ ఖాన్ సినిమా కోసం సహాయం చేయవలసింది గా కోరాడట

సల్మాన్ ఖాన్ గాడ్ ఫాదర్ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.ఇక చిరంజివి రీసెంట్ గా సల్మాన్ ఖాన్ కు ఫోన్ చేసి.. తనకు చెప్పిన ఆటో జాని కథ గురించి చెబుతూ.పూరి జగన్నాథ్ దగ్గర ఓ అద్బుతమైన కథ ఉందని చెప్పారట. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రెడీ చేసిన ఆ కథ  సల్మాన్ కు సెట్ అవుతుందని, బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పారట. కాని దీనికి వెంటనే ఒకే చెప్పని సల్మాన్ ఖాన్ టైమ్ తీసుకొని ఆలోచించి చెప్తాను అని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news