ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. BRS ఫ్లెక్సీలను తొలగించారు. ఢిల్లీలోని భారత రాష్ట్ర సమితి కేంద్ర కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ అధికారులు తొలగించారు.
ఫ్లెక్సీ లకు అనుమతి లేదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు అధికారులు. కాగా సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ ప్రకటనతో ఆ పార్టీ నేతలు ఢిల్లీలోని ఆఫీస్ సమీపంలో రోడ్డుకు ఇరువైపులా దేశ్ కీ నేత అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా, రేపు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.