దేశంలో గుణాత్మక మార్పు కోసమే బిఆర్ఎస్ – కేటీఆర్

-

తెలంగాణ ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ జాతీయ పార్టీగా మారింది. బిఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాలలోకి అడుగుపెట్టింది. ఢిల్లీలో బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలకు మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ రాయదుర్గంలో బోష్ స్మార్ట్ క్యాంపస్ ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ముందే ఖరారు అయిన కొన్ని సమావేశాల కారణంగా బిఆర్ఎస్ కార్యాలయ ప్రారంభోత్సవానికి హాజరు కాలేకపోయానని స్పష్టం చేశారు.

దేశంలో గుణాత్మక మార్పు కోసమే కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి ప్రవేశించారు అన్నారు కేటీఆర్. కొత్త రాజకీయ ఒరవడిని ప్రారంభిస్తున్నామన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బిఆర్ఎస్ వేదికగా దేశానికి పరిచయం అవుతాయన్నారు. తెలంగాణ అభివృద్ధిలో శరవేగంగా దూసుకెళ్తోంది అన్నారు. దేశంలోని అన్ని నగరాల కంటే ఎన్నో మెరుగైన వసతులు ఉన్నందునే గత ఏడాది ఐటీ లో మూడవ వంతు ఉద్యోగాలు హైదరాబాదులోనే వచ్చాయన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news