బిర్యానీ లో అనుకోని అతిధి..షాక్ ఇచ్చిన కస్టమర్..

-

ఇప్పుడు ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదనలో బిజీగా వున్నారు..ఇక వండుకొని తినే టైం లేదు.దాంతో జనాలు ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ లతో కడుపు నింపుకుంటున్నారు.ఇక మరి కొంతమంది ఏదోకటి అంటూ హోటల్ మీద పడి తింటున్నారు.ఆఫీస్ లకు వెళ్ళే వారి పరిస్థితి దారుణంగా మారింది.టైం లేక కళ్ళకు కనిపించింది భుజిస్తున్నారు. ప్రజల అవసరాలను గమనించిన కొన్ని డెలివరీ సంస్థలు కూడా సేవలు అందిస్తున్నాయి. వీటి ద్వారా తమకు కావాల్సినవి, నచ్చినవి ఆర్డర్లు పెట్టుకుని మరీ లాగించేస్తుంటారు. రుచికరంగా అనిపిస్తే చాలు.. అడ్డూ అదుపూ లేకుండా తినేస్తున్నారు..

 

అవి ఎక్కడ నుంచి వస్తున్నాయి..ఎలా వస్తున్నాయి.. చేసేవాళ్ళు నీటిగా వున్నారా లేదా అనేవి అస్సలు పట్టించుకోరు.ఫలితంగా అడ్డమైన రోగాలు వస్తున్నాయి. అయితే కొన్ని ఘటనల్లో మనం ఆహారంలో పురుగులు, బొద్దింకలు, ఈగలు కనిపించిన ఘటనలు చూశాం. అయితే.. ఇప్పుడు కస్టమర్ కు అనుకొని అతిథి వచ్చింది..అసలు మ్యాటర్ ఏంటో ఓ లుక్ వేసుకోండి..

హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో లా చదువుతున్న రాజేష్‌ అక్టోబర్‌ 21న నల్లకుంటలోని ఓ బిర్యానీ హౌస్‌లో భోజనం చేశాడు. ఆ సమయంలో అందులో ఈగ కనిపించింది. ఈ విషయం గురించి వివరిస్తూ ఆయన హోటల్ నిర్వాహకులకు కంప్లైంట్ చేశారు. అయితే నిర్వాహకులు పట్టించుకోలేదు. అంతే కాకుండా బిర్యానీకి బిల్లు వసూలు చేశారు..దాంతో ఫుల్ ఫైర్ అయిన మనోడు కంప్లయింట్ చేశాడు..

విచారణ జరిపిన ఫోరం.. ఫిర్యాదు దారుడికి నష్ట పరిహారంగా రూ. 10 వేలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. తనకు జరిగినట్లు మరొకరికి జరగకూడదనే ఫోరంలో కేసు వేసినట్లు రాజేష్‌ తెలిపాడు..అందుకే బయట తినే ముందు ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకొని తినాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు..జాగ్రత్త సుమీ..

Read more RELATED
Recommended to you

Latest news