ఆ నటుడిని ధన్య రెండో పెళ్లి చేసుకుంది… వైరల్ కామెంట్స్ చేసిన కల్పిక..

-

కల్పిక గణేష్ ఈ మధ్యకాలంలో ఈమె పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంది టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కల్పిక అయితే తాజాగా ఈమె నటి ధన్య బాలకృష్ణ పై చేసిన వ్యాఖ్యలు వైరల్గా మారాయి.

కల్పికా గణేష్ తాజాగా సమంత హీరోయిన్గా నటించిన యశోద చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది.. అలాగే ఇంతకు ముందు ప్రయాణం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, జులాయి, పడిపడి లేచే మనసు చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆమె.. అయితే ఈమె తాజాగా నటి ధన్య బాలకృష్ణ వ్యక్తిగత జీవితం పై కొన్ని వ్యాఖ్యలు చేశారు..

ధన్య బాలకృష్ణ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. 7th సెన్స్‌, నేను శైలజ, జయ జానకి నాయక వంటి చిత్రాలల్లో నటిగా అలరించిన ఆమె ఈ మధ్య వెబ్‌ సిరీస్‌లో సైతం నటించింది. అయితే ఈమెను టార్గెట్ చేస్తూ కల్పిగా తాజాగా యూట్యూబ్లో ఒక వీడియోను అప్లోడ్ చేసింది అయితే ఈ వీడియో కాపీరైట్ ఇష్యూ కింద తొలగించడం జరిగింది.. ఇందులో ఏమని చెప్పిందంటే.. “ధన్య బాలకృష్ణ కోలీవుడ్ డైరెక్టర్ బాలాజీ మోహన్‌ను ఈ ఏడాది జనవరిలో రెండో పెళ్లి చేసుకుంది. మొదటి నుంచి ఆమె చెన్నై వెళ్లినప్పుడల్లా బాలాజీ మోహన్‌తోనే ఉండేది. అయితే అప్పటికే బాలాజీకి పెళ్లయి భార్యకు విడాకులు కూడా ఇచ్చాడు. తమిళంలో సినిమాలు చేస్తున​ క్రమంలో బలాజీతో ఆమె పరిచయం అయ్యింది. అది కాస్తా ప్రేమగా మారడంతో వారిద్దరు సీక్రెట్ గా వివాహం చేసుకున్నారు.. వీరిద్దరికి పెళ్లయి ఏడాది కావోస్తోంది. అయినా ఇప్పటికీ తమ రిలేషన్‌ను వారు బయటకు చెప్పేందుకు ఇష్టపడటం లేదు. అయితే వారి పెళ్లి విషయం తెలిసి ధన్య గురించి నాకు భయం వేసింది. ఆమెను ఏమైనా టార్చర్ పెడతాడేమో అంటూ నాకు భయమేసింది కానీ వారు ఇద్దరు మాత్రం అన్యోన్యంగానే ఉంటున్నట్టు తెలిసి కొంత ఆనందం కలిగింది.. అయితే ఈ విషయం ఇప్పుడు చెప్పడానికి ఓ కారణం ఉంది. ధన్య మూవీ ప్రమోషన్స్‌కి రావడం లేదు. ఈ విషయంలో బాలాజీ ఆమెను ఇబ్బంది పెడుతున్నాడెమో అనిపించింది. అందుకే నేను ఈ విషయాన్ని చెప్పాల్సి వచ్చింది” అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news