కరీంనగర్లో బీజేపీ సభలో పాల్గొనేందుకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు నిరసన సెగ తగిలింది. తెలంగాణ చౌక్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్న అడ్డుకునే ప్రయత్నం చేసిన బీఆర్‌ఎస్ నేతలు.. నడ్డా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. జేపీ నడ్డా టూర్లో సెక్యూరిటీ వైఫల్యం ఏంటనీ బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. బీఆర్ఎస్ రానున్న రోజుల్లో వీఆర్ఎస్గా మారి అంతరించిపోతుందని బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. చాలు దొర.. సెలవు దొర నినాదంతో జనంలోకి వెళ్లి కేసీఆర్ ప్రభుత్వానికి స్వస్తి పలుకుతామన్నారు. కరీంనగర్లో జరిగిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన ప్రసంగించారు.
ఉట్టికి ఎగరలేనమ్మ.. స్వర్గానికి ఎగురుతాను అన్నట్లుగా కేసీఆర్ అతిగా ఆలోచిస్తుండన్నారు.త్వరలోనే కేసీఆర్ వీఆర్ఎస్ తీసుకునే సమయం ఆసన్నమైందన్నారు. ఒకప్పుడు మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టింది కేసీఆరే అని విమర్శించారు. 3.92 లక్షల కోట్ల లోటులో ప్రస్తుతం తెలంగాణ ఉందన్నారు జేపీ నడ్డా