రేవంత్ టార్గెట్‌గా ఉత్తమ్-భట్టి..టీడీపీ వాళ్లే.!

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి. రేవంత్ రెడ్డి పి‌సి‌సి అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి కాంగ్రెస్ లో ముందు నుంచి ఉన్న సీనియర్లు..రేవంత్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. కోమటిరెడ్డి లాంటి వారైతే..రేవంత్ చంద్రబాబు మనిషి అని, చంద్రబాబు చెప్పడం వల్లే పి‌సి‌సి కూడా వచ్చిందని, కాంగ్రెస్ లో టీడీపీ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఫైర్ అవుతూ వచ్చారు.

ఇంకా పలువురు నేతలు కూడా అదే తరహాలో విమర్శలు చేస్తూ వచ్చారు..కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని, భట్టి విక్రమార్క గాని డైరక్ట్ రేవంత్‌ని టార్గెట్ చేసి విమర్శలు చేసిన సందర్భాలు లేవు. కానీ తాజాగా పదవుల పంపకాల విషయంలో అన్యాయం జరిగినని వరుసపెట్టి కాంగ్రెస్ నేతలు గళం విప్పుతున్నారు. రేవంత్ టార్గెట్ గానే విమర్శలు చేస్తున్నారు. పదవులు వచ్చిన వారిలో సగం మంది టీడీపీ వాళ్ళే అంటున్నారు. సీనియర్లని చిన్న చిన్న పదవులు ఇచ్చారని కొండా సురేఖ, దామోదర రాజనరసింహ లాంటి వారు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ లో కోవర్టు రాజకీయం నడుస్తుందని అన్నారు.

తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం.. టీడీపీ నుంచి వచ్చిన వాళ్లకే కొత్త కమిటీల్లో కొత్తవాళ్లకు చోటు కల్పించారని, కడదాకా కాంగ్రెస్‌లోనే ఉంటానని ఉత్తమ్ స్పష్టం చేశారు. కొంత మంది పార్టీకి అన్యాయం చేస్తున్నారని, కొంతమందిని అవమానపర్చేందుకే కమిటీలు నియమించారని, కమిటీల్లో 108 మందిలో 54 మంది వలస నేతలేనని, కమిటీల కూర్పుపై మరోసారి హైకమాండ్‌ను కలుస్తామని చెప్పారు.

అటు పదవుల పంపకాలపై సీనియర్ నేతలు భట్టి ఇంట్లో భేటీ అయ్యారు. సీనియర్ కమిటీ కూర్పులో తనని ఎవరు సంప్రదించలేదని, కాంగ్రెస్ పార్టీని కొందరు హస్తగతం చేసుకునే కుట్ర జరుగుతుందని, సేవ్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ముందుకెళ్తామన్నారు. అంటే అందరూ రేవంత్ టార్గెట్ గానే విరుచుకుపడుతున్నారు. మరి ఈ రచ్చ కాంగ్రెస్ పార్టీకి పెద్ద డ్యామేజ్ చేస్తుంది..ఇంకెంత కాలం ఈ రచ్చ కొనసాగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news