కేసీఆర్ ప్రభుత్వంలో మహిళల్లో చైతన్యం వచ్చింది : మంత్రి ఎర్రబెల్లి

-

మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేడు జనగామలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ చేసే కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు తగ్గిపోయాయని, ఒకప్పుడు ఖర్చుల కోసం మహిళలు భర్త ముందు చేయి జాపాల్సి వచ్చేదని, ఇప్పుడు భర్తలు మందు కోసం భార్యలను బుదగరిస్తున్నరని అన్నారు మంత్రి ఎర్రబెల్లి. కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహిళల్లో చైతన్యం వచ్చిందని, ఆర్థికంగా ఎదుగుతున్నారని చెప్పారు మంత్రి ఎర్రబెల్లి.

Warangal: The other side of Errabelli Dayakar Rao

40 ఏండ్ల రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానన్న ఎర్రబెల్లి కేసీఆర్ తెచ్చినటువంటి అద్భుతమైన స్కీంలను ఎవరూ తీసుకురాలేదని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. గతంలో మహిళళు నీటి కోసం అష్టకష్టాలు పడేవారని, ఎక్కడికి వెళ్లినా బోర్లు వేయమని అడిగేవారని చెప్పారు మంత్రి ఎర్రబెల్లి. తన పైసలన్నీ బోర్లకే సరిపోయేవని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. కేసీఆర్ దాదాపు రూ.40వేల కోట్లు ఖర్చు చేసి మిషన్ భగీరథ నీళ్లు తీసుకొచ్చాడని, ఇప్పుడు ఏ మహిళా నీటి కోసం ఇబ్బంది పడటం లేదని గుర్తు చేశారు మంత్రి ఎర్రబెల్లి.

Read more RELATED
Recommended to you

Latest news